ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ Xiaomi సబ్ బ్రాండ్ పోకో, రియల్‌మీ బ్రాండింగ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తుంది. ఈ బ్రాండ్ ఫోన్లకు జనాల్లో భారీ డిమాండ్ ఉంది. కంపెనీ బడ్జెట్ ధరలో ఎక్కువగా ఫోన్లను ఈ బ్రాండింగ్ కిందే రిలీజ్ చేస్తుంది. అయితే తాజాగా Poco F6 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త అప్‌డేట్‌లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇది Redmi K70 రీబ్రాండింగ్‌గా వచ్చే అవకాశం ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా, 120W ఫాస్ట్‌ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్లు, లాంచ్ వివరాల గురించి తెలుసుకోండి.
Poco F6 Pro డిజైన్ గురించి మాట్లాడితే గురించి మాట్లాడితే Xiaomi సాధారణంగా లెటెస్ట్ డిజైన్‌తోనే తీసుకొస్తుంది. కంపెనీ ఇప్పటి వరకు ఒకే డిజైన్‌తో ఏ ఫోన్ కూడా తీసుకురాలేదు. అయితే Poco F6 ప్రో కూడా భిన్నమైన డిజైన్‌లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంకా Poco F6 ప్రో Redmi K70 రీబ్రాండెడ్ వెర్షన్‌గా తెలుస్తోంది. కానీ Poco F6 ప్రో కొన్ని ఆకట్టుకునే ఫీచర్లతో రానుంది. ఫోన్‌ను మిడ్ రేంజ్ ప్రైజ్‌లో తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఫోన్ శక్తివంతమైన Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌ను కలిగి ఉండవచ్చు. ఇది 16GB RAMతో Geekbenchలో కనిపించింది. Poco తరచుగా Redmi ఫోన్‌లను రీబ్రాండ్ చేస్తుంది. ఇటీవల Poco X6 ప్రో ప్రారంభించింది. ఇది ఎక్కువగా Redmi K70E ఆధారంగా రూపొందించబడింది. అయినప్పటికీ, K70Eతో పోలిస్తే చిన్న బ్యాటరీ, స్లో ఛార్జింగ్‌తో సహా Poco X6 ప్రోకి కొన్ని మార్పులు చేయబడ్డాయి. Poco F6 ప్రో యొక్క అంచనా స్పెసిఫికేషన్‌లు విషయానికి వస్తే ఫోన్‌లో 6.67అంగుళాల పెద్ద OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది QHD+ రిజల్యూషన్‌తో వస్తుందరని సమాచారం. కెమెరా సెటప్ పరంగా ఈ ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఛార్జింగ్ విషయంలో ఇది 120W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. Poco జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా Poco F6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.