Poco F7 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్..ఫీచర్లు లీక్

Poco F7 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్..ఫీచర్లు లీక్

ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు Poco సంస్థ పోకో ఎఫ్7 ప్రో, పోకో ఎఫ్7 అల్ట్రా మొబైల్ ఫోన్ల  గ్లోబల్ లాంచ్ తేదీని ప్రకటించింది. మార్చి చివరి వారంలో సింగపూర్‌లో జరిగే గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌లో ఈ ఫోన్లను విడుదల చేయనుంది. షియోమి సబ్ బ్రాండ్ అయిన ఈ స్మార్ట్ఫోన్ల డిజైన్‌కు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేసింది. Poco F7 Pro..రెడ్‌మి  కె80 గ్లోబల్ వేరియంట్‌గా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అయితే పోకో ఎఫ్7 అల్ట్రా.. రెడ్‌మి కె80 ప్రో మాదిరిగానే ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ రెండు ఫోన్లు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లపై పనిచేస్తాయి. అదనంగా డిజైన్,స్పెసిఫికేషన్లకు సంబందించిన వీడియోను విడుదల చేశారు. 

Poco F7 సిరీస్ లాంచ్ తేదీ 

మార్చి 27న సింగపూర్‌లో పోకో F7 సిరీస్ ఫోన్లను విడుదల చేయనున్నారు. కంపెనీ షేర్ చేసిన టీజర్ ఇమేజ్‌లో పోకో డిజైన్, కలర్ల్ రివీల్ చేశారు. F7 ప్రో ,పోకో F7 అల్ట్రా స్మార్ట్ ఫోన్లు.. బ్లాక్, ఎల్లో కలర్లలో ఒకే డిజైన్ తో కనిపిస్తున్నాయి. వీటిలో వెనకభాగంలో LED ఫ్లాష్‌తో కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి. Poco F7 Pro స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC తో పనిచేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. అయితే అల్ట్రా వెర్షన్ లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను ఉంటుందని తెలుస్తోంది. 

ALSO READ | గూగుల్ ప్లేస్టోర్ నుంచి 300 యాప్లు తొలగింపు..6కోట్ల మంది యూజర్ల డేటా చోరి

టెక్ టాబ్లెట్స్ అనే యూట్యూబ్ ఛానల్ విడుదల చేసిన వీడియోలో ఈ రెండు స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లు డిటెయిల్స్ ఉన్నాయి.  పోకో ఎఫ్7 ప్రోలో 12 GB RAM, అల్ట్రా మోడల్‌లో 16 GB RAM ఉన్నాయి. రెండు హ్యాండ్‌సెట్‌లు 512 GB స్టోరేజ్‌ను కలిగి ఉన్నాయి. ఈ వీడియో హ్యాండ్‌సెట్‌ల రిటైల్ బాక్స్‌ను చూపిస్తుంది.ఇందులో ప్రొటెక్టివ్ కేస్, ఛార్జర్, USB టైప్Cకేబుల్, డాక్యుమెంటేషన్, సిమ్ఎజెక్టర్ టూల్,స్మార్ట్‌ఫోన్ ఉన్నాయి. ప్రో మోడల్ 90W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని, అల్ట్రా మోడల్ 120W వైర్డ్ ఛార్జింగ్‌ను కలిగి ఉందని భావిస్తున్నారు.వాటికి డిస్ ప్లే హోల్-పంచ్ కటౌట్ ఉంది.

Poco F7 సిరీస్ HyperOS 2 పై పనిచేస్తుంది. 50మెగాపిక్సెల్ OIS మద్దతు గల మెయిన్ కెమెరా ఉంది. డస్ట్, వాటర్ ప్రూఫ్ కోసం IP68 రేటింగ్‌ సిస్టమ్ ఉంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే F7 ప్రో 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే Poco F7 అల్ట్రా 5,300mAh బ్యాటరీని ఉంటుందని భావిస్తున్నారు.