Poco తన మిడ్ రేంజ్X7 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విడుదల చేసేందుకు సిద్దంగా ఉంది. జనవరి 9న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్ లో Poco X1 ప్రో, Poco X7 రెండు స్మార్ట్ ఫోన్లు రూ. 30వేల కంటే తక్కువ ధరతో ఉంటాయని అంచనా వేస్తున్నారు. అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెన్సార్, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నడిచే HyperOS 2.0పై నడుస్తాయని ఇటీవల లీకైన సమాచారం ద్వారా తెలుస్తోంది.
Poco X7 ప్రో స్పెసిఫికేషన్స్:
Poco X7 Pro 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేతో వస్తుంది. పైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో గరిష్టంగా 3200 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్ ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 4nm ప్రాసెస్ తో MediaTek డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ వేగంగా పనిచేస్తుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం Mali G720 MC6 GPU ఉంటుంది. రామ్ విషయానికి వస్తే.. 8GB / 12GB LPDDR4X RAM , 256GB / 512GB స్టోరేజ్‌తో రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుందని భావిస్తున్నారు.
ALSO READ | వాట్సాప్తోటే ఎక్కువ మోసాలు.. ఈ యాప్ ద్వారానే నిరుడు మూడు నెలల్లో 43,797 ఫ్రాడ్స్
ఆప్టిక్స్ కోసం ఇది OIS , EISతో 50MP ప్రైమరీ షూటర్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫ్రంట్ లో 20MP షూటర్ కెమెరా తో వస్తుంది.
బ్యాటరీ విషయానికొస్తే.. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీతో వస్తోంది. రెండు స్మార్ట్ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Xiaomi తాజా HyperOS 2.0పై రన్ అయ్యే అవకాశం ఉంది.డస్ట్ ఫ్రూఫ్, వాటర్ ప్రూఫ్ కోసం IP68 రేటింగ్కూడా ఉంటుంది.
Poco X7 స్పెసిఫికేషన్స్:
Poco X7 స్మార్ట్ ఫోన్..6.67 అంగుళాల1.5K OLED డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ప్రొటెక్షన్, MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు.
కెమెరా సిస్టమ్ కూడా 50MP ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్ , 2MP మాక్రో లెన్స్‌తో వస్తుంది. ఫ్రంట్ లో 20MP సెల్ఫీ షూటర్ ఉండనుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5110 mAh బ్యాటరీని ప్యాక్ తో వస్తుందని ఇటీవలీ లీకులు చెబుతున్నాయి.