నిజామాబాద్: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మహేశ్ పై పోక్సో కేసు రిజిస్టర్ అయింది. విచారణ కోసం అదుపులో తీసుకోగా ఇవాళ ఉదయం పరారయ్యాడు. ఓ కేసులో ఒకరికి నాన్ బెయిల్ వారంట్ ఇవ్వడానికి నిజామాబాద్ మండలంలోని ఒక విలేజ్ వెళ్లిన సందర్భంలో అక్కడున్న బాలిక పట్ల మహేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. పేరెంట్స్ సహాయంతో బాలిక కంప్లైంట్ చేయగా పోక్సో కేసు నమోదు చేశారు.
ఏసీపీ కిరణ్ కుమార్ ఆదేశాలతో మహేశ్‌ను నిన్న అదుపులో తీసుకున్నారు. గణతంత్ర వేడుకల్లో పోలీసులందరూ నిమగ్నమైన సమయంలో స్టేషన్ నుంచి జారుకున్నాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న సీపీ కలమేశ్వర్ సింగనేవార్ స్టేషన్ నుంచి పరారైన కానిస్టేబుల్ మహేశ్‌ను పట్టుకోడానికి స్పెషల్ టీంను రంగంలోకి దింపారు.