కారేపల్లి,వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్ పై పోక్సో కేసు నమోదైంది. ఎస్ఐ రాజారాం తెలిపిన ప్రకారం.. రేలకాయలపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో భూక్య వెంకటేశ్వర్లు డిప్యూటీ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారని కొందరు బాలురు ఇటీవల హెడ్మాస్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఐటీడీఏ అధికారులు రెండు రోజుల కింద డిప్యూటీ వార్డెన్ సస్పెండ్ చేశారు. మరో విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో డిప్యూటీ వార్డెన్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.