ఆదిలాబాద్ జిల్లాలో పీఈటీపై పోక్సో కేసు

ఆదిలాబాద్ జిల్లాలో పీఈటీపై పోక్సో కేసు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న పీఈటీని అరెస్ట్ చేసి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్​ఎస్పీ అఖిల్ మహాజన్​ మంగళవారం వివరాలు వెల్లడించారు. జిల్లాలోని మావల మండలం జడ్పీహెచ్ఎస్​ స్కూల్ పీఈటీ గుండి మహేశ్(54) విద్యార్థినులు, యోగా టీచర్​తో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. 

దీంతో బాధితులు షీ టీమ్ కు ఫిర్యాదు చేశారు. పీఈటీని అరెస్ట్ చేసి రెండు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.  విద్యార్థులు, మహిళలు వేధింపులకు గురైతే షీ టీమ్ 8712659953 నంబర్ కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు.