సీఐపై పోక్సో కేసు.. ఖాకీ చొక్కాతొ నీచ పనులు

సీఐపై పోక్సో కేసు.. ఖాకీ చొక్కాతొ నీచ పనులు

కాజీపేట, వెలుగు : మైనర్‌‌‌‌పై ఆత్యాచారానికి యత్నించిన సీఐపై కాజీపేట పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో పోక్సో కేసు నమోదు అయింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌‌‌‌కు చెందిన మంతెన రవికుమార్‌‌‌‌ గతంలో వరంగల్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ పరిధిలోని మామునూరు సీఐగా పనిచేసేవారు. ఈ నెల 6న అతడిని మల్టీజోన్‌‌‌‌ 1 ఐజీ ఆఫీస్‌‌‌‌కు అటాచ్‌‌‌‌ చేస్తూ ఆర్డర్స్‌‌‌‌ వెలువడ్డాయి. 

ఇదిలా ఉండగా కాజీపేట వడ్డేపల్లిలోని పీజీఆర్‌‌‌‌ లేక్‌‌‌‌ వ్యూ అపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో ఉంటున్న సీఐ రవికుమార్‌‌‌‌ ఈ నెల 9న అదే అపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో ఉంటున్న ఓ మైనర్‌‌‌‌ను బెదిరించి ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు. బాలిక సీఐ నుంచి తప్పించుకొని బయటకు వచ్చి తన పేరెంట్స్‌‌‌‌కు చెప్పింది. దీంతో వారు 10న కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత పోలీస్‌‌‌‌ ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లారు. విచారణ జరిపిన పోలీసులు సీఐ రవికుమార్‌‌‌‌పై 22న పోక్సో కేసు నమోదు చేశారు.