సింగరేణి స్కూల్‌‌‌‌ టీచర్‌‌‌‌పై పోక్సో కేసు

సింగరేణి స్కూల్‌‌‌‌ టీచర్‌‌‌‌పై పోక్సో కేసు
  • బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రుల ఆందోళన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సింగరేణి పరిధిలోని కొత్తగూడెం హైస్కూల్‌‌‌‌ తెలుగు టీచర్‌‌‌‌పై పోక్సో కేసు నమోదు అయింది. మణుగూరు స్కూల్‌‌‌‌లో పనిచేసే తెలుగు టీచర్‌‌‌‌ వేణు వారం కింద కొత్తగూడెం పోస్టాఫీస్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో గల సింగరేణి స్కూల్‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌పై వచ్చాడు. ఇతడు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఏడో తరగతి క్లాస్‌‌‌‌ టీచర్‌‌‌‌ గురువారం సాయంత్రం హెచ్‌‌‌‌ఎం సాయి సుజాత దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో హెచ్‌‌‌‌ఎం శుక్రవారం ఉదయం బాలికలతో పాటు, టీచర్‌‌‌‌ వేణును విచారించారు. ఇదే టైంలో బాలికల తల్లిదండ్రులు స్కూల్‌‌‌‌ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. అనంతరం టీచర్‌‌‌‌ వేణుపై చర్య తీసుకోవాలని వన్‌‌‌‌టౌన్‌‌‌‌ పీఎస్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు టీచర్‌‌‌‌ను అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు. 

టీచర్‌‌‌‌పై సస్పెన్షన్‌‌‌‌ వేటు

కొత్తగూడెం సింగరేణి స్కూల్‌‌‌‌ టీచర్‌‌‌‌ వేణుపై ఆరోపణలు రావడంతో అతడిని సస్పెండ్‌‌‌‌ చేసినట్లు ఎడ్యుకేషన్‌‌‌‌ జీఎం బి. నికోలస్​ఓ ప్రకటనలో తెలిపారు. వేణు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడని, ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.