జగదేవపూర్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. గజ్వేల్ ఏసీపీ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పోసానిపల్లి రమేశ్(28) అదే గ్రామానికి చెందిన నాలుగేళ్ల పాపకు చాక్లెట్ ఇస్తానని చెప్పి 2021 నవంబరులో ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. నేరం రుజువవడంతో అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి రమేశ్ కు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
మరో కేసులో నాలుగేండ్లు..
నారాయణపేట: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరస్తుడికి నాలుగేండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ నారాయణపేట జిల్లా సెషన్స్ జడ్జి తీర్పునిచ్చారు. మరికల్పోలీస్స్టేషన్పరిధిలోని గ్రామానికి చెందిన పదో తరగతి బాలిక(14)ను కొండ రవి(23) ప్రేమ పేరుతో వేధించేవాడు. 2022 ఏప్రిల్లో బాలిక ఇంట్లోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. సెషన్స్జడ్జి ఎండీ రఫీ నిందితుడికి నాలుగేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించారు.