- జగిత్యాల జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పు
మల్లాపూర్ , వెలుగు:- బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన బాలుడిపై అదే గ్రామానికి చెందిన యువకుడు గోగుల సాయికుమార్(24) ఏప్రిల్, 2019లో లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి.. చార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా జరిగిన వాదోపవాదాల అనంతరం దోషిగా తేలిన నిందితుడు సాయికుమార్ కు జైలు శిక్షతో పాటు, జరిమానా విధిస్తూ జడ్జి నీలిమ తీర్పు చెప్పినట్టు ఎస్ఐ రాజు తెలిపారు.