ఒక్కసారి ఛాన్స్ ​ఇవ్వండి ఆర్మూర్​ ను డెవలప్​ చేస్తా: వినయ్​రెడ్డి

ఆర్మూర్, వెలుగు: ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశమిస్తే, రాష్ట్రంలో ఆర్మూర్​ను అభివృద్ధి పథంలో ముందుంచుతానని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి కోరారు. ఆర్మూర్ మండలం చేపూర్ లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీ కార్డు పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని అమలు చేయలేదని దుయ్యబట్టారు.

ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ఎల్లప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. శుక్రవారం ఆర్మూర్​లో జరిగే రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు చిన్నా రెడ్డి, పీసీసీ అడ్వైజరీ కమిటీ మెంబర్ కోల వెంకటేశ్, బద్ధం రాజు, కటికె శీను, తోపారం భగత్, అభినవ్, మురళీధర్, చిట్యాల పోశెట్టి, శ్రీకాంత్, నవీన్, శాంతి, గంగ సాయన్న, ఇందుర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.