- స్టేట్ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ పొదెం వీరయ్య
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మహిళా సంక్షేమానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని స్టేట్ ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. కొత్తగూడెం పట్టణం రామవరంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో విజేతలుగా రాణిస్తుండడం అభినందనీయమన్నారు. మహాలక్ష్మి స్కీంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం పథకం అద్భుతంగా సాగుతోందన్నారు.
అర్హులైనవారికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా అందజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో అడవులను రక్షించడంతో పాటు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ ప్రోగ్రాంలో జిల్లా సఖి సెంటర్ కో ఆర్డినేటర్శుభ శ్రీ, పంచాయతీ రాజ్ సీనియర్ అసిస్టెంట్అంబికా, ఉమెన్స్‌కాలేజీ లెక్చరర్విశాలిని, టీపీసీసీ మెంబర్శౌరి, బీఎస్పీ స్టేట్జనరల్సెక్రటరీ యెర్రా కామేశ్, నాయకులు గడ్డం రాజశేఖర్, మోత్కూరి ధర్మారావు, కాసుల వెంకట్, రజాక్, వై.శ్రీనివాస్‌రెడ్డి, పల్లపు లక్ష్మణ్, రాంచందర్పాల్గొన్నారు.