
మంచిర్యాల జిల్లా భీమారం మండలం అంకుశాపూర్ లో అటవీ అధికారులు వేస్తున్న ట్రెంచ్ వివాదాస్పదంగా మారింది. గ్రామ శివారులోని సర్వే నెంబర్ 140లో గత 50 సంవత్సరాలనుండి సాగు చేసుకుంటున్న పొడు భూములను, మిషన్ కాకతీయ చెరువును అటవీ అధికారులు ఆక్రమిస్తున్నారని రైతులు నిరసనకు దిగారు. అటవీ అధికారులు చెరువును పూడ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు వేస్తున్న ట్రెంచ్ ని గ్రామస్థులు అడ్డుకున్నారు. కాలువలో కూర్చొని నిరసనకు దిగారు రైతులు.
పోడు సాగు చేసుకుంటున్నటువంటి ప్రాంతాలను గుర్తించకపోగా..పోడు భూములు సర్వే చేయడం.. ఎఫ్ఆర్సి కమిటీలు వేయడం గానీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ అధికారులు ఉదేశ్యపూర్వకంగా పోడు రైతులకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు. నిరుపేదలు, దళితులు సాగు చేసుకుంటున్న పోడు భూములను వదిలేయాలని డిమాండ్ చేశారు.