కలెక్టర్ రూమ్ కు నమస్కారం చేసిన పొంగులేటి

పోడు భూములకు పట్టాలిస్తానన్న కేసీఆర్ ..మాట తప్పారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికీ 9 సంవత్సరాలు గడుస్తున్నా కేసీఆర్ ఒక్క ఎకరం పోడు భూమికి పట్టా ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే గిరిజనులు గుర్తుకు వస్తారా అని ప్రశ్నించారు.  పథకాలను అమలు చేయడమంటే.. మాటలు చెప్పినంత సులభం కాదుని అన్నారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తానని చెప్పి.. వారి మీద కేసులు పెడుతూ జైలు పాలు చేస్తున్నారని పొంగులేటి విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోడు రైతు భరోసా యాత్రలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

పొడు భూముల కోసం పోరాడుతున్న గిరిజనులకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మద్దతుగా నిలిచారు. ఇందులో భాగంగా శనివారం (మే 27న) కొత్తగూడెం కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేయడానికి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారాయన. అయితే అక్కడ కలెక్టర్ లేకపోవడంతో కలెక్టర్ రూమ్ కు నమస్కారం చేసిన పొంగులేటి అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.