అందెశ్రీ భావోద్వేగం

అందెశ్రీ భావోద్వేగం

తాను రచించిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ పాట రాష్ట్ర గీతంగా ఆవిష్కృతమవుతున్న సమయంలో కవి అందెశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. పిడికిలి బిగించి, చేతిని పైకెత్తి.. ‘జై తెలంగాణ’ అంటూ కంటి నిండా నీళ్లు తెచ్చుకున్నారు. రాష్ట్ర గీతాన్ని ఆదివారం ఉదయం పరేడ్​ గ్రౌండ్​లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్​రెడ్డి రిలీజ్​చేశారు. 2 నిమిషాల 32 సెకన్ల షార్ట్​ వెర్షన్​ను ప్లే చేశారు. పాట ప్లే అవుతున్న సందర్భంలో అందెశ్రీ ఎమోషనల్​ అయ్యారు.