పైలట్​ ప్రాజెక్టుగా పొక్కూర్.. గ్రామస్తుల హర్షం

పైలట్​ ప్రాజెక్టుగా పొక్కూర్.. గ్రామస్తుల హర్షం

చెన్నూరు, వెలుగు: తమ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి నిధులు మంజూరు చేయడంతో చెన్నూర్​ మండలం పొక్కూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. గ్రామంలో రైతు భరోసా పథకం కింద 704 మంది రైతుల ఖాతాల్లో రూ.1.14 కోట్లు, ఆత్మీయ భరోసా పథకం కింద 66 మందికి 7.92 లక్షలు, గ్రామంలోని 37 మంది అర్హులకు కొత్త రేషన్ కార్డులు అందించారని అనందం వ్యక్తం చేశారు. 

పైలట్ ప్రాజెక్ట్ కింద తమ గ్రామాన్ని ఎంపిక చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కర్ణ సాగర్ రావు, కాంగ్రెస్ నేత అయిత హేమంత రెడ్డి, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాప గౌడ్, మాజీ ఎంపీటీసీ ఆకుదారి లక్ష్మి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.