![స్టూడెంట్తో అసభ్య ప్రవర్తన.. స్కూల్ కరస్పాండెంట్ పై పోక్సో కేసు](https://static.v6velugu.com/uploads/2025/02/pokso-case-file-on-school-correspondent_S85JBV6Mvy.jpg)
ఇబ్రహీంపట్నం, వెలుగు: స్టూడెంట్తో అసభ్యకరంగా ప్రవర్తించిన స్కూల్కరస్పాండెంట్పై ఇబ్రహీంపట్నం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దినావన్రావు అనే వ్యక్తి కొన్నేండ్ల కింద రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు వలస వచ్చాడు. స్థానికంగా వ్యాపారం చేస్తూనే స్కూల్నడుపుతున్నాడు.
తాజాగా స్కూల్లోని ఓ మైనర్స్టూడెంట్తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దినావన్రావుపై పోక్సో యాక్ట్కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రాజు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలోనూ ఇతను స్టూడెంట్లతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.