
మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ రెవెన్యూ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్‌లో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కు చెందిన పోలా శ్రీనివాస్ ఆరోపించారు.
ఈ మేరకు శనివారం శనివారం తహసీల్దార్ హరిబాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను అప్డేట్ చేసేందుకు నిర్వాహకులు రూ. 150 తీసుకున్నారన్నారు.
ఇదేంటని ప్రశ్నిస్తే అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారని మండిపడ్డారు. చార్జీల బోర్డు కూడా ఏర్పాటు చేయలేదని, సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.