పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు

పోలవరం పరాజెక్టు అథారిటీ చైర్మెన్ అతుల్  జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది అథారిటీ. ఈ  సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ సీఈలు సుగుణాకర్, నర్సింహమూర్తి పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, అంచనా వ్యయం, నిధులు వంటి తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు అధికారులు. పోలవరం ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం అనుగుణంగా తెలంగాణ ప్రాంతంలో ముంపును గుర్తించే అంశాన్ని ప్రస్తావించింది తెలంగాణ ప్రభుత్వం.

పోలవరం బ్యాక్ వాటర్స్ ప్రభావం పడే కిన్నెరసాని, ముర్రేడువాగు సహా ఇతర ప్రవాహాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించింది ప్రభుత్వం. భద్రాచలం పట్టణం, ఆలయం, మణుగూరు భారజల కేంద్రం వద్ద వాటర్ లెవల్స్ అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే చేయాలని..ముంపు, బ్యాక్ వాటర్స్ ప్రభావంపై అధ్యయనం చేయాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. కొత్తగా సర్వే అవసరం లేదని, గతంలో ఉన్న వివరాలు సరిపోతాయని ఏపీ చీఫ్ ఇంజినీర్లు వాదించగా.. సంయుక్త సర్వే చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్ణయించింది.