
కోల్బెల్ట్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా స్థానిక పోలీసులు, 213 సీఆర్పీఎఫ్ బెటాలియన్సాయుధ పోలీసులు మందమర్రిలోని కార్మికవాడల్లో శనివారం మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. ఈ కవాతును మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాలు సహకరించాలని డీసీపీ కోరారు. ఈ సందర్భంగా పట్టణంలోని వేంకటేశ్వర గుడి, అర్బన్మిషన్ భగీరథ ట్యాంక్, జి.మార్ట్, మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్, సీఐఎస్ఎఫ్ క్యాంప్ మీదుగా కవాతు కొనసాగింది. మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.