- 13.5 కిలోల గంజాయి స్వాధీనం
సుజాతనగర్, వెలుగు : సినీ ఫక్కీలో గంజాయి వాహనాన్ని పోలీసులు, ఎక్సయిజ్ సిబ్బంది కలిసి సోమవారం పట్టుకున్నారు. కొత్తగూడెంలో ఎక్సైజ్ సీఐ జయశ్రీ తెలిపిన ప్రకారం కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ తన సిబ్బందితో పాల్వంచ సమీపంలో వెహికల్ చెక్ చేస్తుండగా మారుతి ఎర్టీగా కారు ఆపకుండా వేగంగా దూసుకెళ్లి పోయింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చి ఎక్సైజ్ పోలీసులు కారును వెంబడించారు. సుజాతనగర్ ఎస్సై తిరుపతి తన సిబ్బందితో పోలీసులు వాహనాన్ని అడ్డు పెట్టి ఆపే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసు వాహనాన్ని కారు ఢీకొట్టింది.
అనంతరం రోడ్ పక్కన నిలిపి ఉన్న స్కూటీని ఢీకొట్టి ఆగిపోయింది. కారులో ఉన్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును సుజాతనగర్ స్టేషన్ పీఎస్కు తరలించారు. అనంతరం వాహనాన్ని, ముగ్గురు యువకులను కొత్తగూడెం ఎక్సయిజ్ పొలీస్ స్టేషన్ కు తరలించారు. వెహికిల్ ను చెక్ చేయగా 13.5 కిలోల గంజాయి లభించింది. వీరు ఏపీలోని చింతూరు నుంచి మిర్యాలగూడకు గంజాయిని తరలిస్తున్నట్లు తెలిపారు. ముగ్గురుని అరెస్ట్ చేశామన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.