
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో శుక్రవారం పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. చిన్న చిన్న గల్లీల్లో వందల మంది పోలీసులు ఒక్కసారిగా కదలిరావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎప్పుడూ వాహనాల్లో వెళ్లే పోలీసులు నడుస్తూ వెళ్లడంతో ఆశ్చర్యంగా చూశారు. ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పోలీసు కమిషనర్ శ్వేత ఆదేశాలతో హుస్నాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ మార్చ్ జరిగింది. కార్యక్రమంలో సీఐ కిరణ్, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ ఎస్ఐలు మహేశ్, వివేక్, తిరుపతి, కేంద్ర బలగాల అధికారులు పాల్గొన్నారు.
బెజ్జంకి: మండల కేంద్రంలో ఏసీపీ సురేందర్ రెడ్డి, సీఐ చేరాలు, ఎస్ఐ నరేందర్ రెడ్డి సీఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు, స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.