ఖమ్మంలో ముగిసిన పోలీస్‌ వార్షిక క్రీడలు

ఖమ్మంలో ముగిసిన పోలీస్‌ వార్షిక క్రీడలు

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ (2025) మంగళవారం సాయంత్రం ఘనంగా ముగిసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీల్లో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి సీపీ సునీల్ దత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైరా, ఖమ్మం రూరల్ డివిజన్ల టాగ్ ఆఫ్ వార్ పోటీలను ఆసక్తిగా తిలకించారు.

టాగ్ ఆఫ్ వార్ లో సీపీ పాల్గొని ఉత్సహపరిచారు. ఈ పోటీలో ఖమ్మం రూరల్ విజయం సాధించింది. అనంతరం  ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, వైరా, కల్లూరు, డివిజన్లు, ఆర్మ్ డ్ రిజర్వ్, ట్రాఫిక్ నుంచి పాల్గొన్న పోలీసు క్రీడాకారుల నుంచి సీపీ గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ క్రీడా పతాకాన్ని పోలీస్ కమిషనర్ కు క్రీడాకారులు అందించారు. వ్యక్తిగత చాంపియన్ గా సీఏఆర్ కానిస్టేబుల్ బి.గణేశ్, మహిళా కానిస్టేబుల్ ఎల్.భవాని నిలిచారు.

ఓవరాల్ చాంపియన్ గా సిటీ ఆర్ముడ్ రిజర్వ్ జట్టు నిలిచింది. స్పోర్ట్స్ మీట్​లో విజేతలుగా నిలిచిన వారికి, జట్లకు ట్రోఫీలు, మెడల్స్, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ క్రీడలు సక్సెస్​కు కృషి చేసిన పోలీసు అధికారులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేశ్​ కుమార్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీలు కుమారస్వామి, విజయ బాబు, ట్రైనీ ఐపీఎస్ రుత్విక్ సాయి, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.