ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్ ..అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు

ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్ ..అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు

ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్  ప్రకటించారు పోలీసులు.. అడవులను జల్లెడ పడుతున్నారు.  సెప్టెంబర్ 5న జరిగిన భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో  తెలంగాణ చత్తీస్ ఘడ్  సరిహద్దులో పోలీసులు  విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తుల వివరాలు ఆరా తీశారు. తాడ్వాయి, మంగపేట, వెంకటాపురం, ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు  చేస్తున్నారు.  ఎన్ కౌంటర్ లో  ఎవరైనా మావోయిస్టులు తప్పించుకున్నారా అనే కోణంలో తనిఖీలు  చేస్తున్నారు.  ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఏజెన్సీ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ALSO READ | ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో చనిపోయిన మావోయిస్టుల గుర్తింపు

సెప్టెంబర్ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథ పాలెం అటవి ప్రాంతాంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మీృతి చెందిన సంగతి తెలిసిందే.. మృతుల్లో ఒక మహిళా నక్సలైట్ ఉన్నారు.