కాశీబుగ్గ, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం వరంగల్ సిటీలోని పలు సెంటర్లలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏసీపీ నందిరామ్ నాయక్, మిల్స్ కాలనీ సీఐ మల్లయ్యతో కలిసి బుధవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, వాహనాదారుడు సరైన ప్రతాలను చూపించాలని చెప్పారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తే వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నరు.