పోలీసులు ఉన్నారు.. హెల్మెట్ పెట్టుకో : గూగుల్ మ్యాప్ ఇలా కూడా అప్ డేట్ చేస్తుందా..?

పోలీసులు ఉన్నారు.. హెల్మెట్ పెట్టుకో : గూగుల్ మ్యాప్ ఇలా కూడా అప్ డేట్ చేస్తుందా..?

సాధారణంగా మనం గూగుల్ మ్యాప్ ను ఎందుకు ఉపయోగిస్తాం.. ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అడ్రస్ కనుక్కునేందుకు.. సులభంగా గమ్యస్థానం చేరుకుంటాం.అయితే  గూగుల్ మ్యాప్ ను ఉపయోగించినప్పుడు ట్రాఫిక్ జామ్ లు, రోడ్ల మూసివేత గురించి వాహనదారులను హెచ్చరిస్తుంది. ఇది అందరికి తెలుసు. కానీ గూగుల్ మ్యాప్ ఇప్పుడు కమ్యూటర్స్ ని మరో విధంగా కూడా అలర్ట్ కూడా చేస్తుందట..  అదేంటంటే.. ముందు పోలీసులున్నారు.. హెల్మెట్ పెట్టుకోండి అని కమ్యూటర్స్ ను హెచ్చిరిస్తుందట. ఈ విషయాన్ని తమిళనాడుకు చెందిన ఓ వాహనదారుడు సోషల్ మీడియా X లో పోస్ట్ చేసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నెటిజన్లతో పంచుకున్నాడు. అదేంటో చూద్దాం రండి. 

చెన్నై కి చెందని సంతోష్  శివన్ అనే X యూజర్.. తన గమ్యస్థానాన్ని చేరుకునేందుకు బైక్ పై వెళ్తున్నాడు. ఇందుకోసం గూగుల్ మ్యాప్ ని ఫాలో అవుతున్నాడు. అయితే ఇంతకుముందెన్నడూ చూడని మేసేజ్ ఒకటి గూగుల్ మ్యాప్ లో చూశాడు. ఆశ్చర్యపోయాడు. ముందు ట్రాఫిక్ పోలీసులున్నారు.. హెల్మెట్ పెట్టుకోండి అని అలర్ట్ మేసేజ్ చూశాడు. ఈ చమత్కారమైన మేసేజ్ ను Xలో షేర్ చేస్తూ. పోస్ట్ త్వరగా వైరల్ అయింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నవ్వుతున్నారు. 

ALSO READ | Mobile Tariff: బడ్జెట్ వల్ల రీఛార్జ్ ప్లాన్ల ధరలు తగ్గేది ఉందా..? మరింత పెరిగే ఛాన్స్ ఉందా..?

Google Maps ఫీనిక్స్ మాల్ సమీపంలో పోలీస్ చెక్ పాయింట్ ఉందన ఫ్లాగ్ చేసింది. ఈ ప్రాంతంలో పోలీసుల ఉనికి గుర్తించి హెచ్చరించింది. తమిళంలో వ్రాసిన లోకేషన్ ట్యాంగ్ ట్రాన్స్ లేట్ చేస్తే.. పోలీసులు ఉన్నారు. హెల్మెట్ ధరించండి అని మేసేజ్ చేయడం కనిపించింది. 

ఈ చమత్కారమైన మేసేజ్ ను చూసి నెటిజన్లు పెద్ద ఎత్తున్న లైకులు కామెంట్లు చేశారు. మంచి మేసేజ్ అని ఓ నెటిజన్ స్పందించగా.. యూఎస్ లో కూడాFM రేడియో స్టేషన్లు హైవే పెట్రోలింగ్ పోలీసుల ఎక్కడెక్కడున్నారో తెలియజేస్తుందన్నారు. నిజమైన సామాజిక సేవ అంటూ మరో నెటిజన్ గూగుల్ మ్యాప్ తెగ మెచ్చుకున్నాడు. ఏదీ ఏమైనా ఓ పరిణామే ఇది  అంటున్నారు ఈ విషయం తెలిసిన వారంతా..