హైదరాబాద్,వెలుగు: సిటీలో డ్రగ్స్ దందాకు చెక్ పెట్టేందుకు పోలీసులు మత్తుకి బానిసైన వారిని ట్రేస్ చేస్తున్నారు. స్పెషల్ టీమ్స్‌తో డ్రగ్ సప్లయర్స్, కస్టమర్ల డేటా కలెక్ట్ చేస్తున్నారు. డ్రగ్స్ నెట్‌వర్క్ టార్గెట్‌గా కస్టమర్లను గుర్తించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా ఓల్డ్ డ్రగ్ అఫెండర్స్‌ను విచారిస్తున్నారు. సిటీలో షెల్టర్ తీసుకున్న నైజీరియన్స్ యాక్టివిటీని మానిటరింగ్ చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి వీసా గడువు ముగిసినా సిటీలో ఉంటోన్న విదేశీయులు డేటాను కలెక్ట్ చేశారు. ఈ క్రమంలో టోనీ గ్యాంగ్ సమాచారాన్ని ముంబయి పోలీసులకు అందించారు. దీంతో అంధేరీలో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో శుక్రవారం తనిఖీలు నిర్వహించి ఓ మహిళ వద్ద సుమారు 4 కిలోలకు పైగా ఎఫిడ్రిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకుంది. ఆస్ట్రేలియా నుంచి ఎఫిడ్రిన్ ను దిగుమతి చేసుకున్నట్లు గుర్తించింది. ఇంటర్నేషనల్ డ్రగ్ స్మగ్లర్ టోనీ నెట్‌వర్క్ కి చెందిన గోవా, ముంబయి నుంచి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న సుమారు 18 మంది ఏజెంట్స్‌ను సిటీ పోలీసులు గుర్తించారు. టోనీని కస్టడీలోకి తీసుకుని మరింత మంది ప్రధాన నిందితుల వివరాలు కలెక్ట్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా టోనీని వారం రోజుల పాటు కస్టడీకి పర్మిషన్ కోరుతూ సోమవారం పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు డ్రగ్స్ సప్లయర్స్ ఫోన్ నంబర్స్‌ను పరిశీలిస్తున్నారు. వారితో కాంటాక్ట్‌లో ఉన్న రెగ్యులర్ కస్టమర్స్ డేటాను సేకరిస్తున్నారు. టోనీ డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న నలుగురు వ్యాపారస్తుల కోసం
గాలిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం
55 లక్షల గంజాయి స్వాధీనం
అభివృద్ధిని ప్రజలు గమనించాలి