ఫేస్‌బుక్ పేజీ, టెలిగ్రామ్ ఖాతా ద్వారా 'లైలారావు' పేరుతో ప్రచారం జరుగుతున్న ఆన్‌లైన్ పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. చాలా మంది మధ్యతరగతి మహిళలను మోసగాళ్లు ప్రలోభపెట్టి, భారీ మొత్తంలో డబ్బును కాజేసినట్లు పోలీసులు గుర్తించిన తర్వాత ఈ సలహా ఇచ్చారు.
లైలారావు పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసి, ప్రజలను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. లైలారావు పేరుతో రోజువారి కార్యకలాపాలును ఆప్ లోడ్ చేస్తున్నారు. టెలిగ్రామ్‌లో లైలా సూపర్, లైలా -ఉర్ ఇన్వెస్ట్‌మెంట్ గైడ్, లైలా రావు బెస్ట్ వంటి పేర్లతో ఇతర ఛానెల్‌లను కూడా నడుపుతున్నారు.
ఆన్ లైన్ పెట్టుబడులు ప్రకటనల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాలపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఫిర్యాదులు నమోదయ్యాయి. మోసగాళ్లు వివిధ రాష్ట్రాల నుంచి ఏకకాలంలో కార్యకలాపాలు సాగిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.