25 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత 

మహదేవపూర్, వెలుగు : మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ భవానీ సేన్ వివరాల ప్రకారం..

కన్నేపల్లి పంపుహౌస్ గ్రావిటీ కెనాల్ వద్ద శుక్రవారం వెహికిల్ చెకింగ్ చేస్తుండగా బొలేరోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నారు. బియ్యం, వెహికిల్ ను సీజ్ చేసి, డ్రైవర్లు రమేశ్, రాజిరెడ్డిపై కేసు నమోదు చేశామని చెప్పారు.