
- రూ.20.60 లక్షలు ఫ్రీజ్, రూ.53 వేల క్యాష్ సీజ్
మియాపూర్, వెలుగు: మియాపూర్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. హఫీజ్‌పేట డివిజన్ మార్తాండనగర్ లోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి బెంగళూరు వర్సెస్ చెన్నై మ్యాచ్‌పై భారీ మొత్తంలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు మాదాపూర్ జోన్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది.
ఆ ఇంటిపై రైడ్ చేసి మియాపూర్‌కు చెందిన భార్యాభర్తలు అజయ్(46), సంధ్య(40), వ్యాపారస్తులు జీత్శర్మ(30), సుమంత్(28), గణేశ్‌కుమార్(31)ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు రాజస్థాన్‌కు చెందిన సురేశ్(46), కారా(25) పరారీలో ఉన్నారు. రూ.53 వేల క్యాష్, ఐదు సెల్ఫోన్లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి బ్యాంక్ అకౌంట్లలోని రూ.20.60 లక్షలను ఫ్రీజ్ చేశారు.