
కల్వకుర్తి, వెలుగు : డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే రెండు, మూడు రెట్లు లాభాలు వస్తాయని ఆశ చూపి ప్రజల నుంచి రూ. 90 కోట్లు వసూల్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణానికి చెందిన ముజమ్మిల్ స్థానికంగా మసీదులకు ప్రార్థన కోసం వస్తూ చాలా మందిని పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో 20 మందిని ఏజెంట్లను పెట్టుకొని, లాభాల పేరుతో వసూళ్లకు పాల్పడ్డాడు.
వీటిని తీసుకెళ్లి వివిధ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేశాడు. తద్వారా వచ్చిన లాభాలతో రూ. 50 కోట్లను ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చాడు. ఈ క్రమంలో తాను పెట్టుబడి పెట్టిన ఒక సంస్థ యజమాని మరణించడంతో రూ. 14 కోట్లు లాస్ అయ్యాడు. దీంతో ఇన్వెస్టర్లకు డబ్బులు ఇవ్వలేకపోవడంతో కల్వకుర్తి నుండి వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు తో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ సమావేవంలో సీఐ నాగార్జున ఎస్సై మాధవరెడ్డి తదితరులు ఉన్నారు.