![బీరు సీసాలతో వ్యక్తిపై దాడి.. ముగ్గురి అరెస్ట్](https://static.v6velugu.com/uploads/2025/02/police-arrest-three-accused-in-case-of-assault-on-man-with-beer-bottles_ELcdeQhZ4y.jpg)
బెల్లంపల్లి, వెలుగు: బీరు సీసాలతో ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో నిందితులైన ముగ్గురిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలోద్దిన్ టూ టౌన్ ఎస్సై కె.మహేందర్‌తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 7న టూ టౌన్ పరిధిలోని కాల్‌టెక్స్‌లో ఉన్న ఎస్‌ఆర్‌ఆర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో తాండూర్‌కు చెందిన బండారి వంశీపై ముగ్గురు వ్యక్తులు బీరు సీసాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు బార్లో సీసీ కెమెరాల రికార్డును పరిశీలించి దాడికి పాల్పడ్డ బెల్లంపల్లిలోని గాంధీనగర్‌కు చెందిన అల్లి సాగర్, బట్వాన్ పల్లి గ్రామానికి చెందిన రత్నం సోమయ్య, మంచిర్యాలలోని ఇస్లాంపూర్‌కు చెందిన మామిడి అన్నమయ్యను అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు. వీరిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.