- పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులు
ఇబ్రహీంపట్నం, వెలుగు: జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగలుగా మారిన ఇద్దరిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అన్నబోయిన్పల్లికి చెందిన మూల అజేందర్, ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం భాగ్యనగర్ తండాకు చెందిన గుగులోతు అంజి కలిసి తుర్కయంజాల్ సమీపంలోని బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నారు.
సోమవారం ఉదయం ఇబ్రహీంపట్నం చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా, పల్సర్ బైక్పై వచ్చిన వీరిద్దరూ బండి ఆపకుండా పారిపోయేందుకు యత్నించారు. దీంతో వారిని పట్టుకొని విచారించగా, సినిమాలు, సిగరెట్ల వంటి జల్సాల కోసం బైక్దొంగతనాలు చేస్తున్నట్లు అంగీకరించారు. వారి నుంచి5 బైక్లను స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్కు తరలించారు.