![ఐటీ కారిడార్ లో హెరాయిన్ అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్](https://static.v6velugu.com/uploads/2025/02/police-arrest-two-people-selling-heroin-in-it-corridor_afUSldo5zO.jpg)
చందానగర్, వెలుగు : వెస్ట్ బెంగాల్ నుంచి హెరాయిన్ తీసుకువచ్చి ఐటీ కారిడార్ లో అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్ ఏక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 41 గ్రాముల సరుకు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఎస్కె నసిముల్ (27) నానక్‌రాంగూడలో ఉంటూ లేబర్ పని చేస్తున్నాడు. ఇదే జిల్లా కి చెందిన ఎస్కె అలియల్ (28) స్థానికంగా హెరాయిన్ ని గ్రాముకు రూ.1500 చొప్పున కొని, సోమవారం హైదరాబాద్ లోకు వచ్చాడు.
దాన్ని నసిముల్ కు ఇచ్చి గ్రాముకు రూ. 5000 చొప్పున స్థానికంగా ఉన్న లేబర్, ఐటీ ఉద్యోగులకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న శంషాబాద్ ఏక్సైజ్ పోలీసులు నసిముల్, అలియల్ ను అదుపులోకి తీసుకుని వీరి నుంచి 41 గ్రాముల సరకు ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని శేరిలింగంపల్లి ఏక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.