కుళ్లిన చికెన్ అమ్మిన ఇద్దరు అరెస్ట్

కుళ్లిన చికెన్ అమ్మిన ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: కుళ్లిన చికెన్ అమ్మిన ఇద్దరు షాపు ఓనర్లను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ సుధీంద్ర తెలిపారు. రసూల్ పురలోని అన్నా నగర్, అర్జున్ నగర్ లోని రెండు చికెన్​షాపుల్లో గురువారం 600 కిలోల కుళ్లిన చికెన్​ను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. 

ఈ కేసులో ఇద్దరు షాపు ఓనర్లు ఎం.భాస్కర్, బొట్టా రవీందర్​ను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ చికెన్ వేస్టేజ్, బోన్స్ కొన్ని నెలల వరకు నిల్వ ఉంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లకు తక్కువ ధర అమ్ముతున్నట్లు తెలిపారు.