అభివృద్ధిపై పనులపై ప్రశ్నించినందుకు ఓ వార్డ్ మెంబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యక్రమం మధ్యలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును ఓ వార్డు మెంబర్ ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే తననే ప్రశ్నిస్తావా అంటూ నోటికి పని చెప్పారు. దీంతో అక్కడనే ఉన్న పోలీసులు ఆ వార్డు మెంబర్ ను అదుపులోకి తీసుకున్నారు.
జగిత్యాల జిల్లా కొనరావుపేటలో ‘మన ఊరు – మన బడి’ పనుల శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వచ్చారు. శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మధ్యలో వార్డు మెంబర్ గంగారెడ్డి జోక్యం చేసుకున్నాడు. వేదికపైకి ఎక్కి అభివృద్ధి పనులు జరగటం లేదంటూ నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వార్డు మెంబర్ ను వేదికపై నుంచి దించివేశారు. తర్వాత గంగారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు.