
మహబూబాబాద్ జిల్లాలో భారీ గంజాయి పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్ లో ఇద్దరు అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వారిని చెక్ చేశామని.. అందులో ఒక మహిళ ఉందని.. ఆమెతో పాటు ఉన్న వ్యక్తి పారిపోయాడని పేర్కొన్నారు పోలీసులు. అయితే మహిళ దగ్గర 42.63 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ జిల్లా పాడేరు నుంచి పూణేకు 19 ప్యాకెట్లను బ్యాగుల్లో తరలిస్తుండగా.. మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
ఆమె మహారాష్ట్రకు చెందిన మహిళగా గుర్తించారు. ఆమె విజయవాడ నుంచి వస్తున్నట్లుగా తెలిపారు. ఈ మహిళపై గతంలో కూడా గంజాయి కేసులు ఉన్నట్లు తెలుస్తుందని పోలీసులు వివరించారు. ఈ కేసులో మరికొంతముంది వ్యక్తులు ఉన్నారని.. వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.