జనగామ జిల్లాలో కారు బీభత్సం.. మరీ ఇంత ర్యాష్ డ్రైవింగా..!

జనగామ జిల్లాలో కారు బీభత్సం..  మరీ ఇంత ర్యాష్ డ్రైవింగా..!

 జనగామ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో సూర్యాపేట రోడ్డులో అత్యంత ర్యాష్ డ్రైవింగ్ తో కార్ హల్ చల్ చేయడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. నలుగురు యువకులు అత్యంత వేగంతో కారు నడపడంతో అదుపు తప్పి రోడ్డుకు అడ్డం తిరుగుతూ దూసుకొచ్చింది. 

అత్యంత వేగంగా వచ్చిన కారు  రోడ్డు పక్కన ఉన్న ఎనిమిది బైకులను ఢీ కొట్టింది. అక్కడే ఉన్న 5 మందిపైకి దూసుకెళ్లింది. కారు అదుపు తప్పడంతో బ్రేక్ లు వేసినప్పటికీ రోడ్డుపై జారుతూ రావడంతో దుమ్ము లేస్తూ సినిమా సీన్లను గుర్తు తలపించింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో నలుగురికి స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

కారు బీభత్సం సృష్టించడంతో ఆ చుట్టు పక్కనే ఉన్న స్థానికులు కారులో ఉన్న యువకులను పట్టుకొని పోలిసులకు అప్పజెప్పారు. యువకులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు.