సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్టు

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్టు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: సైబర్  నేరగాళ్లకు బ్యాంక్  ఖాతాలను సప్లయ్‌‌‌‌‌‌‌‌  చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను తెలంగాణ సైబర్  సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద  నుంచి 14 కరెంట్‌‌‌‌‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన 11 చెక్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌, 23 సిమ్‌‌‌‌‌‌‌‌  కార్డులు, 10 ఏటీఎంలు, ఒక స్వైపింగ్  మెషీన్, 3 ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్ లు, ఫేక్  డాక్యుమెంట్ల కోసం వినియోగిస్తున్న రబ్బర్  స్టాంప్‌‌‌‌‌‌‌‌, రౌండ్‌‌‌‌‌‌‌‌  సీల్‌‌‌‌‌‌‌‌ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ వివరాలను సైబర్  సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  శిఖా గోయల్ శుక్రవారం వెల్లడించారు.

హైదరాబాద్ లోని అల్మాస్ గూడ వినాయక హిల్స్‌‌‌‌‌‌‌‌కు చెందిన కందుకూరి రవీందర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌రెడ్డి(40), అత్తాపూర్‌‌‌‌‌‌‌‌  నలంద నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బండ్లమూడి రవి (42) సైబర్ నేరగాళ్లకు కమీషన్లపై బ్యాంక్  ఖాతాలను సప్లయ్‌‌‌‌‌‌‌‌  చేస్తున్నారు. ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌, బంధువులకు డబ్బు ఆశచూపి వారితో కరెంట్‌‌‌‌‌‌‌‌ అకౌంట్స్  ఓపెన్  చేయించారు. ఇందుకోసం ప్రైవేట్‌‌‌‌‌‌‌‌  కంపెనీలకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. వీటిని ఒక్కో అకౌంట్‌‌‌‌‌‌‌‌ను రూ.25 వేలకు చొప్పున సైబర్  నేరగాళ్లకు అందించారు.

వనస్థలిపురానికి చెందిన కొత్తండ రమణ మురళీకృష్ణ (53), కుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సుభాష్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సమినేని మాధవరావు (40) తో కలిసి 14 కరెంట్‌‌‌‌‌‌‌‌  ఖాతాలు తెరిచారు. వాటిని ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌  గేమింగ్‌‌‌‌‌‌‌‌, ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఫ్రాడ్స్  చేస్తున్న సైబర్  నేరగాళ్లకు అందించారు. కాగా.. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాది మే నెలలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌  ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌  పేరుతో ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లో ప్రకటన చూశాడు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయనడంతో ఆసక్తి చూపాడు. ఈ క్రమంలో ‘ఏ 117 ఐఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌  అఫీషియల్ స్టాక్  కమ్యూనిటీ’ పేరుతో సైబర్  నేరగాళ్లు వాట్సాప్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో ఆ వ్యక్తిని యాడ్ చేశారు. గ్రూప్‌‌‌‌‌‌‌‌ అడ్మిన్‌‌‌‌‌‌‌‌గా ఉన్న అంకుర్  కేడియా తను చీఫ్​ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిచయం చేసుకున్నాడు. మాయమాటలు చెప్పి జూన్‌‌‌‌‌‌‌‌ 9 నుంచి జూలై 2 వరకు రూ.5,27,69,000 ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌  చేయించి మోసం చేశారు.