సజీవదహనం ఘటన పథకం ప్రకారం జరిగిన హత్యగా మంచిర్యాల జిల్లా పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కేసులో ఏ1 గా లక్ష్మణ్, ఏ2గా శాంతయ్య భార్య సృజన, ఏ3గా రమేశ్, ఏ4 గా సమ్మయ్య, ఏ5గా అంజయ్య ఉన్నారు. హత్యానేరం కింద కేసు నమోదు చేశామని రామగుండ సీపీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.
వివాహేతర సంబంధమే హత్యకు కారణమని వివరించారు. చనిపోయిన వాళ్లందరూ ఎస్సీలు కావడంతో నిందితులపై అట్రాసిటీ కేసు కూడా పెట్టామన్నారు. అయితే ఈ హత్యతో సృజన ఇద్దరు కొడుకులు, బిడ్డకు సంబంధం లేదన్నారు. సజీవదహనం జరిగిన స్థలంలో దొరికిన పెట్రోల్ క్యాన్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు.