హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీమ్ : ఇలా కూడా చేస్తారా అంటూ జనం షాక్

రాను రాను అక్రమ వ్యాపారాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. చిన్న పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లు ఐస్ క్రీములను కూడా వదలట్లేదు అక్రమార్కులు... ఆ మధ్య పలుచోట్ల గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. విస్కీతో తయారు చేసిన ఐస్ క్రీమ్ కోసం పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఎగబడతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు కేఫ్ పై దాడి చేయగా ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.

Also Read:-తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి కన్నుమూత

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ వన్ అండ్ ఫైవ్ లో లో హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ షాపులో విస్కీ ఐస్ క్రీమ్ అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక కేజీ ఐస్ క్రీమ్ లో 60ml 100 పేపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్ముతున్నారని తెలిపారు పోలీసులు.

 

అక్కడితో ఆగని ఈ ముఠా మరో అడుగు ముందుకు వేసి ఫేస్ బుక్లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాల్ని పెంచుకునే ప్రయత్నం చేశారని తెలిపారు పోలీసులు. పక్కా సమాచారంతో కేఫ్ పై దాడి చేసిన ఎక్సయిజ్ అధికారులు ఆఫ్ కేజీ విస్కీ ఐస్ క్రీమ్ లను 23 పీసులను11.5 కేజీల విస్కీ ఐస్ క్రీములను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.