రూ. 5 లక్షలకు 10 లక్షల ఫేక్ కరెన్సీ..నిందితుడు అరెస్ట్

 హైదరాబాద్  హయత్ నగర్ లో ఫేక్ కరెన్సీ అమ్ముతున్న కామెరూన్ దేశస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ కరెన్సీ నోట్లు మార్పిడి చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  హయత్ నగర్ చైత్ర లాడ్జ్ లో మాటువేసి పట్టుకున్నారు పోలీసులు..

అసలైన నోట్లు రూ. 5 లక్షలు ఇస్తే  రూ. 10 లక్షల ఫేక్ కరెన్సీ  ఇస్తాను అని మోసం చేస్తున్నాడు.  గతంలోనూ  బెంగళూరులో  ఫేక్ కరెన్సీ కేసులో కామెరూన్ దేశస్థుడు జాక్వెస్ డివొలిస్ కిట్ అరెస్ట్ అయ్యాడు.  ఇతను  ఫేక్ పాస్ పోర్ట్ తో  తిరుగుతున్నట్టు గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.