శ్యామ్‌దివాకర్ యూపీ నుంచి గోధుమ పిండిలో గంజాయి తీసుకురాగా, ఇక్కడ ఐస్‌క్రీం బండిలో పెట్టి దానిని విక్రయించేవారు. దీంతో పాటు వేములవాడకు చెందిన పరిగిపండ్ల అన్వేష్ అలియాస్ బన్ని, మర్రిపల్లి సురేశ్‌కు సప్లై చేసేవారు. ఈ ఇద్దరు పలువురు యువకులకు అమ్మేవారు. ఈక్రమంలో బన్ని, సురేశ్ వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి రైతువేదిక సమీపంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసి వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరినీ విచారించగా శ్యామ్‌దివాకర్, మల్లికార్జున్, భాను గురించి చెప్పారు. దీంతోపాటు గంజాయికి అలవాటుపడిన వేములవాడకు చెందిన భూమేశ్, సచిన్, సాయికు అమ్మేవారమని పోలీసులకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కాగా భూమేశ్, సచిన్, సాయి పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితుల వద్ద 2కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. మీడియా సమావేశంలో సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు మారుతి, అంజయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.