బైక్ దొంగల ముఠా అరెస్ట్​..నాలుగు బైక్‌‌లు స్వాధీనం

బైక్ దొంగల ముఠా అరెస్ట్​..నాలుగు బైక్‌‌లు స్వాధీనం

కరీంనగర్ క్రైం, వెలుగు : ముఠాగా ఏర్పడి బైక్​దొంగతనాలు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. విజయవాడకు చెందిన బొజ్జ మనోజ్ కుమార్ కరీంనగర్‌‌‌‌లోని నగునూర్ లో వెల్డింగ్ షాప్‌‌లో పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌‌కు చెందిన బందెల సుమిత్ , విజయవాడకు చెందిన యెల్ల సత్య ఆంజనేయులుతో పాటు ఓ మైనర్ బాలుడితో కలిసి వీరు ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలకు అలవాటుపడిన వీరు కొంతకాలంగా కరీంనగర్‌‌‌‌లో బైక్‌‌ దొంగతనాలు చేస్తున్నారు.

వీరిపై సిటీ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. బుధవారం కరీంనగర్ రూరల్ పరిధిలోని తీగలగుట్ట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నాలుగు బైక్‌‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రదీప్‌‌కుమార్‌‌‌‌, టాస్క్​ఫోర్స్‌‌ సీఐ రవీందర్‌‌‌‌ తెలిపారు.