కాలేజీ స్టూడెంట్సే వీళ్ల టార్గెట్.. ఈ-సిగరెట్లు అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్‌

హైదరాబాద్ నగరంలో కాలేజీ స్టూడెంట్సే లక్ష్యంగా నిషేధిత ఈ-సిగరెట్లను (E-Cigarettes) అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దర్ని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.3 లక్షల విలువ చేసే ఈ-సిగరెట్లు, 2 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

మాధవ్ అనే వ్యక్తి కోల్‌కతా, ముంబై నుంచి కొరియర్ ద్వారా సిగరెట్లను తెప్పిస్తున్నాడని, వాటిని హైదరాబాద్ లోని పలు కాలేజీలకు చెందిన విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

ALSO READ : సముద్రంలో చిక్కుకున్న తమిళ మత్స్యకారులు : కాపాడిన విశాఖ కోస్ట్ గార్డ్

అచ్యుత గౌతమ్ అనే వ్యక్తి.. 71 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఈ-సిగరెట్లు అమ్ముతున్నట్లు నిర్ధారించారు. అరెస్టయిన వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారిపై కేసు నమోదుచేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.