రాను రాను మోసగాళ్ళలో కూడా క్రియేటివిటీ పెరిగిపోతోంది.. రోజుకో కొత్త పద్దతిలో మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన ఈ మోసం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. జిల్లాలోని తెల్లాపూర్ లో ఫోర్జరీ సంతకంతో ఫ్లాట్ కబ్జా చేసి ఒకేసారి ముగ్గురికి విక్రయించాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. బీరంగూడకు చెందిన ఊరెళ్ళ రాజేందర్ అనే వ్యక్తి నకిలీ పట్టాదారు మహిళను చూపి సంతకం ఫోర్జరీ చేసి 300 గాజుల స్థలాన్ని కాజేసాడు.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ప్లాట్ నెంబర్ 656/A లో 300 గజాల ప్లాటు శశికళ అగర్వాల్ పేరు మీద ఉండేది, ఆ ఫ్లాట్ పైన కన్నీసిన ఊరెళ్ళ రాజేందర్.. శశికళ అగర్వాల్ కి బదులు వేరే మహిళను పెట్టి సంతకం ఫోర్జరీ చేసి 2003 సంవత్సరంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
Also Read : ఫుడ్ సేఫ్టీలో హైదరాబాద్ చివరన ఉందా
ఆ ఫ్లాట్ ను వారం రోజుల్లోనే వేరే వాళ్లకు విక్రయించారు. అసలు పట్టదారు 2023 సంవత్సరంలో ఫ్లాట్ ను మనుపాటి రాజు అనే వ్యక్తికి విక్రయించారు. మనుపాటి రాజు తను కొన్న ఫ్లాట్లోకి వెళ్లి చూడగా తెల్లాపూర్ కు చెందిన భుజంగారెడ్డి ఫ్లాట్లో ఇల్లు నిర్మించడం చూసి షాకయ్యాడు. మోసపోయిన సంగతి తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆ ఫ్లాట్ ముగ్గురికి విక్రయించారని తేలడంతో రాజేందర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు పోలీసులు.