జాబ్ ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తి అరెస్ట్ .. నిందితుడి వద్ద రూ. 2.01 లక్షలు స్వాధీనం

జాబ్ ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తి అరెస్ట్ .. నిందితుడి వద్ద రూ. 2.01 లక్షలు స్వాధీనం
  • ఆదిలాబాద్ జిల్లా పోలీసులు వెల్లడి

నేరడిగొండ, వెలుగు:  జాబ్ ఇప్పిస్తానని రూ. లక్షల్లో తీసుకుని మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరడిగొండ పోలీసులు తెలిపిన ప్రకారం.. మండలంలోని కుమారి గ్రామానికి చెందిన ఓ బాధితుడు 2021లో ఏపీలోని అనంతపూర్ జిల్లా రేచన్​పల్లిలోని రత్న డిఫెన్స్ అకాడమీలో  కోచింగ్ తీసుకున్నాడు. అతడికి కోచింగ్ సెంటర్​లో చిత్తూరు జిల్లాకు చెందిన కుంచి కల్యాణ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. బెంగళూరులోని ఆఫీసర్లతో తనకు పరిచయం ఉందని, ఎయిర్​ఫోర్స్​లో జాబ్ ఇప్పిస్తానంటూ బాధితుడిని కల్యాణ్ నమ్మించి రూ.13 లక్షలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. 

దీంతో బాధితుడు కొంత నగదుతోపాటు, ఫోన్ పే ద్వారా ఏడాదిలో రూ.5, 88,586 ట్రాన్స్ ఫర్ చేశాడు.  అనంతరం కల్యాణ్ బాధితుడిని తప్పుడు కాల్ లెటర్​కు పంపించాడు. మోసపోయానని గుర్తించిన బాధితుడు 2022లో స్థానిక పీఎస్ లో కంప్లయింట్ చేయగా కేసు నదైంది. ఎస్పీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు నేరడిగొండ ఎస్ఐ శ్రీకాంత్  సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. నిందితుడు మంగళవారం ఆదిలాబాద్ రాగా.. మొబైల్ ట్రేస్ చేసి పట్టుకున్నారు.  అతడి వద్ద రూ.2.01 లక్షల నగదు స్వాధీనం చేసుకొని, రిమాండ్​కు తరలించారు. నేరడిగొండ ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బందిని ఎస్పీ గౌస్ ఆలం అభినందించారు.