
ఘట్ కేసర్, వెలుగు: అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్ముతున్న వ్యక్తిని పోచారం ఐటీసీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ స్పెక్టర్ రాజువర్మ తెలిపిన మేరకు.. చౌదరిగూడ పంచాయతీ వెంకటాద్రి టౌన్ షిప్ లో ఉండే దేశగోని సతీశ్(48) మెయిన్ రోడ్డుపై హోటల్ నిర్వహిస్తున్నాడు. అక్రమంగా హోటల్ లో మద్యం అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో ఎస్ ఐ నాగేశ్వర్ రావు సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. హోటల్ లో మద్యం లభించలేదు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఇంట్లో నిల్వ చేసి అమ్ముతున్నట్లు అంగీకరించాడు. దీంతో 40 మద్యం బాటిళ్లు, 5 బీర్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.