హైదరాబాద్ : CMO కార్యాలయంలో ఓ వ్యక్తి అరెస్టు కలకలం రేపుతోంది. తెలంగాణ సీఎం పబ్లిసిటీ సెల్ లో ఓ దొంగ.. ప్రోటో కాల్ ఆఫీసర్ అవతారం ఎత్తి అరెస్ట్ అయ్యాడు. ల్యాండ్ సెటిల్మెంట్స్, అసైన్డ్ ల్యాండ్ రీ అసైన్డ్ చేస్తానంటూ మోసాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురికి సీఎం ప్రోటో కాల్ నకిలీ స్టిక్కర్స్ ఇప్పించాడు అత్తిలి ప్రవీణ్ సాయి అనే వ్యక్తి. హోం మినిస్టర్, మినిస్టర్స్ లెటర్ హెడ్స్ తో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
నిందితుడు ప్రవీణ్ సాయి.. వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం ప్రభుత్వ పైరవీలు చేస్తూ పలువురికి శఠగోపం పెట్టాడు. అప్పట్లో ప్రవీణ్ సాయిని ఎల్బీనగర్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్నోవా కార్, సెల్ ఫోన్ సీజ్ చేశారు.