నకిలీ పత్రాలు సృష్టించి.. 4.27 ఎకరాల భూమి కబ్జా

  • ఇద్దరు నిందితులు అరెస్టు, ఒకరు  పరారీ

హసన్‌‌‌‌పర్తి , వెలుగు: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి4 .27 ఎకరాల భూమి కబ్జా చేసిన నిందితులను  పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండ జిల్లా నక్కలగుట్టకు చెందిన ఎర్రబోయిన లక్ష్మయ్య.. హసన్ పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామ శివారులో 4.27 ఎకరాల భూమిని2022 కోనుగోలు చేశారు. కూడా కాలనీకి చెందిన మండల ఆదిరెడ్డి, కాసర్ల దేవేందర్ రెడ్డి , వడ్డేపల్లికి చెందిన చిలువేరు సురేందర్, మరికొందరు వ్యక్తులు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ భూమిని కబ్జా చేశారు.

బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హసన్ పర్తి సీఐ జివ్వాజి సురేశ్ తెలిపారు. మండల ఆదిరెడ్డి, కాసర్ల దేవేందర్ రెడ్డి  పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మరో నిందితుడు చిలువేరు సురేందర్ పరారీలో ఉన్నారని సీఐ వెల్లడించారు.